- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ ఓట్ల బదిలీపై జనసేన నేత పోతిన మహేశ్ అనుమానం
దిశ, వెబ్‌డెస్క్: సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. విజయవాడలో టీడీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధిష్టానం స్పందించకపోవడం బాధాకరమన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు కూడా ఈ పరిణామంపై స్పందించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరగుతుందని అనుమానం వ్యక్తం చేశారు.
దీనిపై జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలని కోరారు. కాగా, నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పిఠాపురం టీడీపీ నేతలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వర్మ లాంటి కీలక నేత ఉండగా.. ఈ టికెట్‌న జనసేనకు ఎలా కేటాయిస్తారంటూ సొంత పార్టీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన జనసేన నేత పొతిన మహేశ్ ఓట్ల బదిలీపై అనమానం వ్యక్తం చేశారు.
Read More..