పవన్ కల్యాణ్‌కు వాసిరెడ్డి పద్మ క్షమాపణలు చెప్పాల్సిందే: మంగళగిరిలోని వీరమహిళలు ధర్నా

by Seetharam |   ( Updated:2023-07-31 09:15:02.0  )
పవన్ కల్యాణ్‌కు వాసిరెడ్డి పద్మ క్షమాపణలు చెప్పాల్సిందే: మంగళగిరిలోని వీరమహిళలు ధర్నా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మంగళగిరిలోని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనసేన వీరమహిళలు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. ఇకపోతే మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు పెళ్లిళ్లుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన వీరమహిళలు మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి వీరమహిళలు ర్యాలీగా వెళ్లారు. మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వీరమహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీరమహిళలను పోలీసులు అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు సరికాదన్నారు. వాసిరెడ్డి పద్మ తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాసిరెడ్డి పద్మను అడ్డుకుని తీరుతామని జనసేన వీరమహిళలు హెచ్చరించారు.

Advertisement

Next Story