ఆ వాక్యం నాకు మహా వాక్యం... క్రిస్టియానిటీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఆ వాక్యం నాకు మహా వాక్యం... క్రిస్టియానిటీపై పవన్  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: క్రైస్తవులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. వారిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. డైరెక్ట్‌గా కలిసి తన భావజాలాన్ని చెప్పనున్నారు. తనపై ఉన్న హిందుత్వ ముద్రను తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుభాగంగా ఆయన పశ్చిమగోదావరి జిల్లా అమలాపురం వెళ్లనున్నారు. అక్కడ క్రైస్తవ సోదరులతో కలిసి ఒక రోజంతా చర్చలు జరపనున్నారు. తాను అండగా ఉంటానని క్రైస్తవ సోదరులకు పవన్ హామీ ఇవ్వానున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలతో శుక్రవారం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కోనసీమ అల్లర్లను ప్రస్తావించారు.

అది ప్రేమ సీమ

‘కోనసీమ అంటే కలహాల సీమ అయిపోయింది.. ముఠా సంస్కృతి వచ్చింది’. అని వైసీపీ నాయకులు అంటున్నారని, కానీ అది కలహాల సీమ కాదని.. ప్రేమ ఉన్న సీమ అని పవన్ వ్యాఖ్యానించారు. తాను త్వరలోనే అమలాపురం పర్యనటకు వెళ్తానని చెప్పారు. క్రైస్తవ, పాస్టర్ సోదరులను కలుస్తానని తెలిపారు. వారితో ప్రేమ పూర్వకమైన ఆత్మీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. తన చిన్నతనంలో క్రిస్టియన్ టీచర్ చెప్పిన బైబిల్ సూక్తులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును అనే వాక్యం తనకు మహా వాక్యం అయిందని పవన్ పేర్కొన్నారు. తాను ఎక్కువగా హిందుత్వంపై మాట్లాడతానని కొందరు తనతో చెప్పారని తెలిపారు. అయితే తాను హిందుత్వంలో పుట్టానని, ఆ ధర్మాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఓట్ల కోసం మతతత్వాన్ని ప్రోత్సహించనని చెప్పారు. ఓట్ల కోసం ఎప్పుడూ అలాంటి పనులు చేయనని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఎవరికైనా కష్టం వస్తే తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story