- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల, సీఎం రేవంత్ రెడ్డి పై జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్ని పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీల నేతలు సభలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కడప పార్లమెంట్ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై సీఎం జగన్ స్పందించారు. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో సీఎం జగన్ మాట్లాడుతూ..షర్మిల పోటీ చేయడంపై తనకు బాధ లేదని.. కానీ ఆమె డిపాజిట్ కోల్పోతుందనే బాధ ఎక్కువగా ఉందన్నారు. ఆమె చేస్తోంది కరెక్ట్ కాదు అన్నారు. అక్రమ కేసుల ఛార్జిషీట్‌లలో తన తండ్రి వైఎస్ఆర్, తన పేరును చేర్పించింది కాంగ్రెస్,టీడీపీ పార్టీలు అని జగన్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీలో తన చెల్లెలు షర్మిలను, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నడిపిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.
Read More : మళ్లీ జగనే సీఎం అని KCR కామెంట్స్.. రేవంత్ రెడ్డి షాకింగ్ రియాక్షన్