- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జగన్ నటనకు ఆస్కార్ బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేష్

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మంగళగిరి మండలం నీరుకొండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ.. అట్టర్ ఫ్లాప్ డ్రామాలు, చెత్త నటనకు అవార్డులుంటే వైసీపీ అధినేత జగన్‌కే మొత్తం అవార్డులు వస్తాయాని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. వరుసగా మూడు డ్రామాలు ఫెయిలైనా.. నటన మాత్రం ఏమాత్రం తగ్గడం లేదంటూ పంచ్‌లు పేల్చారు. తాము అధికారంలోకి రాగానే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పున:ప్రారంభిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ వెల్లడించారు. రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పెన్షన్ కొనసాగిస్తాం అన్నారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో చెల్లిస్తాం. గులకరాయితో దాడి ఘటనలో జగన్‌కు ఆస్కార్ కు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.