జనాలు ఛీ కొట్టినా జగన్ తీరు మారలే.. ఏపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
జనాలు ఛీ కొట్టినా జగన్ తీరు మారలే.. ఏపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ. వెబ్ డెస్క్: గవర్నర్ ప్రసంగంలో పసలేదు.. దిశా -నిర్దేశం అంతకన్నా లేదు అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) విమర్శించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ సమావేశాలు (AP Assembly Meetings) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం (Governor's speech) చేశారు. ఈ ప్రసంగంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన షర్మిల.. కూటమి ప్రభుత్వం (NDA Government)పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె.. గవర్నర్ ప్రసంగంలో అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలు ఉన్నాయని, సూపర్ సిక్స్ హామీల (Super Six Guarentees) అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని అన్నారు. సంక్షేమం, పునరుజ్జీవనం అంటున్నారే కానీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో క్లారిటీ లేదని, ఇచ్చిన గ్యాస్ సిలిండర్ తప్పా మిగతా 5 హామీలపై స్పష్టత లేదని మండిపడ్డారు.

మనుషులు, వనరులు, చేపలు అంటూ సామెతలు చెప్పారు తప్పిస్తే.. బాబు విజన్ 2047 (Vision 2047)కి దమ్ము లేదని ఆరోపించారు. అలాగే 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదని, హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆరోపించారు. అంతేగాక రూ.6.5లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి ఎక్కడొచ్చాయి? అని, 4 లక్షల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎవరికిచ్చారు? అని ప్రశ్నించారు. ఇక తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అసలు నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? అని, ఆరోగ్య శ్రీ బకాయిలు ఎప్పుడు చెల్లించారు? అని నిలదీశారు. కొత్త సీసాలో పాత సారా అనే సామెత లెక్క కూటమి మ్యానిఫెస్టోనే గవర్నర్ చదివారు తప్పిస్తే.. కొత్త అంశాలు ఒక్కటి లేవని వ్యాఖ్యానించారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హజరయ్యారు.

దీనిపై షర్మిల స్పందిస్తూ.. ఇక జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని, 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది? అని ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? అని, సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ (Attendence) కోసం వచ్చారా? అని ఎద్దేవా చేశారు. అలాగే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే (Opposite Position) కావాలా? అని, ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని తేల్చి చెప్పారు. ఇక వైసీపీ సభ్యులకు (YCP Leaders) పదవులు ముఖ్యం కాదు అనుకుంటే.. ప్రజాసమస్యల మీద చిత్తశుద్ది ఉంటే.. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరారు. సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు (Resign) చేయాలని కాంగ్రెస్ నేత (Congress Leader) మరోసారి డిమాండ్ (Demand) చేశారు.




Next Story

Most Viewed