Minister Subhash : జగన్ రెండు దశాబ్దాలు ప్రతిపక్షంలో ఉండాలి : మంత్రి సుభాష్

by M.Rajitha |
Minister Subhash : జగన్ రెండు దశాబ్దాలు ప్రతిపక్షంలో ఉండాలి : మంత్రి సుభాష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి(AP Former CM Jagan) పై టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetti Subhash) హాట్ కామెంట్స్ చేశారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) మొదలవనున్న విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరవనుండగా.. మరో రెండు దశాబ్దాలు ఆయనే ప్రతిపక్ష నేతగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. జగన్ సీఎంగా ఎలాగో విఫలం అయ్యారని, కనీసం మంచి ప్రతిపక్ష నేతగా ఉండాలన్నారు. నిజానికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేగా అయినా సభా మర్యాదలు పాటిస్తూ.. విపక్షనేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ విధంగా ఒక మంచి విపక్ష నేతగా రెండు దశాబ్దాలు జగన్ కొనసాగాలని కోరుతున్నానని మంత్రి సుభాష్ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed