- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Assembly సమావేశాలకు వైసీపీ దూరం.. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ మాక్ అసెంబ్లీ
దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు(నవంబర్ 11 సోమవారం) ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ(AP Assembly) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు కేబినెట్(Cabinet) ఆమోదం తెలపనుంది. అనంతరం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. అలాగే ఉ.11 గంటలకు శాసనమండలి సమావేశాలు(Legislative Council meetings) ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్(State budget)ను, మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు (Achchennaidu) ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈ అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. గతంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ గత ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యింది. దీంతో అసెంబ్లీ రూల్స్ ప్రకారం రావాల్సిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఉండటంతో వైసీపీ(YCP) పార్టీకి ప్రతిపక్ష హోదా(Opposition status) ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు తాము బడ్జెట్ సమావేశంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. కేవలం శాసనమండలి సమావేశాల్లో మాత్రమే వైసీపీ నేతలు పాల్గోననున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్(Jagan) భేటీ కానున్నారు. అనంతరం ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి మాక్ అసెంబ్లీ(Mock assembly) నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అలాగే మండలీలో తమ పార్టీ సభ్యులు లేవనెత్తాల్సిన సమస్యల గురించి మాజీ సీఎం జగన్ చర్చించనున్నారు.