- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెవలప్‌మెంట్‌కు అర్థం తెలియని వ్యక్తి జగన్.. ప్రశ్నిస్తే కేసులేంటి?: మాజీమంత్రి పొంగూరు నారాయణ
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని మాజీమంత్రి పొంగూరు నారాయణ ఆరోపించారు. ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే... వారిని జగన్ ప్రభుత్వం భయపెట్టి...వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌కు డెవలప్‌మెంట్ అంటే ఏమిటో తెలియదని మండిపడ్డారు. నెల్లూరు నగరంలో మాజీమంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి నారాయణ మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే మరో శ్రీలంకగా ఆంద్రప్రదేశ్ మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ మాట్లాడుతూ... టీడీపీని లేకుండా చేయాలని...జగన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అది ఈ జన్మకి జరగదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే...ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని మండిపడ్డారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయం తప్ప...డెవలప్‌మెంట్ లేదని చెప్పుకొచ్చారు. తనపై ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టడం దారుణమని వాపోయారు. 2024లో టీడీపీ జనసేనలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు అభివృద్ధి చెందాలంటే నారాయణ గెలవాలని స్పష్టం చేశారు. నారాయణ ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను ఎప్పుడు తిట్టలేదని... ఆయనకు కావాలిసింది అభివృద్ధి మాత్రమేనని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అనిల్ ఛాలెంజ్‌కి తాను రెడీ అని చెప్పుకొచ్చారు. అనిల్ అవినీతికి చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నారాయణ హయాంలో అభివృద్ధికి తాము చర్చకు సిద్ధమని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ నాయకులే... ఈ సారి టీడీపీ గెలుస్తుందని అనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరిముల్లా..మునిసిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్ళపాక అనురాధ ,స్టేట్ కార్యదర్శి రాజా నాయుడు టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.