- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jagan: సీ-ప్లేన్ తో పబ్లిసిటీ స్టంట్‌లు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు(CM Chandrababu) ప్రజలను మాయ చేసి మోసం చేస్తాడని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YCP leader YS Jagan Mohan Reddy) అన్నారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. కూటమి ప్రభుత్వం(AP Government)పై ఫైర్ అయ్యారు. దీనిపై జగన్.. ప్రజలను మభ్య పెట్టేందుకు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలూ వేస్తాడని, తాజాగా విజయవాడ నుంచి శ్రీశైలం(Vijayawada to Srisailam) వరకూ సీ-ప్లేన్(Sea-Plane) ద్వారా చేసిన పర్యటన ఇలాంటిదేనని చెప్పారు. సెల్‌ఫోన్, కంప్యూటర్లు తానే కనిపెట్టానని రెండు దశాబ్దాలుగా కబుర్లు చెప్తున్న చంద్రబాబు, ఇప్పుడు సీ-ప్లేన్ మీద కూడా కహానీలు మొదలెట్టేశారని అన్నారు.
సీ-ప్లేన్ నడిపితే చాలు రాష్ట్రాభివృద్ధి జరిగిపోయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని, చంద్రబాబు బిల్డప్, ఎల్లోమీడియా డప్పాలు చూస్తుంటే పిట్టలదొర డైలాగులు గుర్తుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఓవైపు గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రయివేటుపరం చేస్తూ, స్కాంలు చేస్తూ తన మనుషులకు తెగనమ్ముతూ.. మరోవైపు దీనిమీద ప్రజల్లో చర్చ జరగకూడదనే సీ-ప్లేన్‌తో అభివృద్ధి ఏదో జరిగిపోయినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు(Publicity Stunts) చేస్తున్నారని తెలిపారు. సీ-ప్లేన్ అన్నది ఇప్పటిది కాదని, దాదాపు 114 ఏళ్ల క్రితమే 1910లో నడిచిందని అన్నారు.
ఇలాంటి సీ-ప్లేన్ సర్వీసులను అభివృద్ధికి ఒక ప్రమాణంగా చంద్రబాబు గొప్పగా చెప్పుకోవడం, దాన్ని ఎల్లోమీడియా కీర్తించడం, పరస్పరం డప్పాలు కొట్టుకోవడం కాదా అని ప్రశ్నించారు. సంపద సృష్టించడమంటే సీ- ప్లేన్ మీద పబ్లిసిటీ స్టంట్లు కావని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. మీరు, మీ పార్టీ నాయకుల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధిగా, మీరు, మీమనుషులు ఆస్తులు కూడబెడితే అది ప్రజలకోసం సృష్టించిన సంపదగా చెప్పుకుంటారని, మీ దృష్టిలో అభివృద్ధి, సంపద సృష్టి అంటే ఇదేనని అన్నారు. మీ పబ్లిసిటీ విన్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ప్రభుత్వంలో మీరు చేసే దుర్మార్గపు చర్యలను ప్రజలు తప్పక నిలదీస్తారని, ఈ ప్రభుత్వాన్ని ఎండగడతారని జగన్ రాసుకొచ్చారు.