AP:పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు..టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-06-18 13:13:23.0  )
AP:పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు..టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల తర్వాత సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీలో ఒక్కొక్క పనుల నిర్వహణ పై దృష్టి పెడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం గురించి పట్టించుకున్న వారే లేరని, ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం అధోగతి పాల్జేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం పోలవరం పనులను పూర్తిగా పక్కన పడేసిందని ఆరోపించారు. పోలవరం పనులు 72 శాతం పూర్తి చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని తేల్చి చెప్పారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే పోలవరం పూర్తయి ఉంటే 7.20లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పోలవరం పూర్తి చేసేది చంద్రబాబేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed