Heavy Rains: రేపల్లె జలమయం

by srinivas |   ( Updated:2024-09-07 13:28:47.0  )
Heavy Rains: రేపల్లె జలమయం
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఇప్పటికే బాపట్ల జిల్లాలో పలుచోట్ల భారీగా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు రేపల్లెలోనూ భారీగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. దీంతో రేపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఎగువన కురిసిన వర్షంతో రేపల్లె పట్టణం వణికిపోయింది. కృష్ణానదికి భారీగా వరద నీరు చేరింది. దీంతో నది పొంగి రేపల్లె ప్రాంతంలోకి నీరు చేరుతుందనే హెచ్చరికలతో జనం జంకిపోయారు. కొంత సమయం తర్వాత కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గిపోవడంతో రేపల్లె జనం ఊపరి పీల్చుచుకున్నారు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో రేపల్లె వాసులు భయాందోళనకు గురవుతున్నారు. భారీ వర్షాలతో కృష్ణా నది పొంగితే పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తొమ్మిది నెలల క్రితం వచ్చిన తుఫానుతో తాము చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed