- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
నారా భువనేశ్వరికి కీలక పదవి.. చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో సంచలన పరిణామం..?
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో పార్టీ భవిష్యత్‌పై చర్చ నడుస్తున్నది. అధినేత అరెస్టుతో ఇప్పటికే కేడర్ కొంత డీలాపడింది. త్వరలో యువనేత లోకేశ్ సైతం అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం జరుగుతుండడంతో వారిని మరింత గందరగోళంలోకి నెడుతున్నది.
ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించాల్సిన చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ జైల్లోనే ఎక్కువ కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే పార్టీ సంగతి ఎలా అనే చర్చ మొదలైంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేరుగా రంగంలోగి దిగబోతున్నట్లు తెలుస్తున్నది. ఇన్నాళ్లు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోని ఆమె.. ఈ రోజు టీడీపీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. దీంతో త్వరలోనే ఆమె పార్టీలో కీ రోల్ పోషించబోతున్నట్లు తెలుస్తున్నది.
ప్రజల్లోకి అత్తాకోడళ్లు
చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీకి తానున్నానంటూ బాలకృష్ణ ఇప్పటికే ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమని అనౌన్స్ చేశారు. ఇంతలో నిన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన భువనేశ్వరి ఆ మరుసటి రోజే టీడీపీ ముఖ్యనేతలతో భేటీ కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. నందమూరి తారక రామారావు నిర్మించిన ఈ పార్టీ ఎక్కడికి పోదని, పార్టీ కోసం తమ కుటుంబం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
కేడర్ అధైర్యపడొద్దని కోరారు. దీంతో భువనేశ్వరి, బ్రాహ్మణి నేరుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. లోకేశ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. ఆయన చేస్తున్న యువగళం పాదయాత్రను బ్రాహ్మణి ముందుకు తీసుకుపోతారని.. చంద్రబాబు స్థానంలో భువనేశ్వరి పార్టీ కేడర్‌ను నడిపిస్తారని ప్రచారం జరుగుతున్నది.
అక్కాచెల్లెళ్ల మధ్య పొలిటికల్ వార్..?
గతంలో జగన్ అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల రంగంలోకి దిగి వైఎస్సార్ సీపీ శ్రేణులను ముందుకు నడిపించారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో భువనేశ్వరి, బ్రాహ్మిణి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తే టీడీపీ, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంబోతున్నదనేది చర్చగా మారింది.
చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ప్రోత్సాహం ఉందనే టాక్ ఇప్పటికే నడుస్తుండగా.. ఆ పార్టీ జాతీయ నాయకత్వంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. ఇక భువనేశ్వరి రంగంలోకి దిగితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరిని ఢీకొనక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య పొలిటికల్ డిస్కషన్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతున్నది.