పెయిడ్‌ ఆర్టిస్టులతో చర్చలు జరపడం కరెక్ట్‌ కాదు: బండి శ్రీనివాసరావు

by John Kora |
పెయిడ్‌ ఆర్టిస్టులతో చర్చలు జరపడం కరెక్ట్‌ కాదు: బండి శ్రీనివాసరావు
X

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకే, తెరపైకి కొత్త జిల్లాల అంశం ప్రభుత్వం తీసుకువచ్చిందని ఏపీ ఎన్టీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వం ఏం చేసినా ఉద్యమం మాత్రం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మాట్లాడుతూ.. రాత్రిపూట ఇచ్చిన చీకటి జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

కొంతమంది కలెక్టర్లు, ఐఏఎస్‌ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించిన ఆయన, రేపటి నుంచి వాళ్ల దగ్గర పని చేసే వాళ్ళు ఉండరని జోస్యం చెప్పారు. ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా, ఏ చిన్న సంఘం వచ్చినా చర్చలు జరుపుతామని ప్రకటించటం సరికాదన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులను తయారు చేసి, వారితో చర్చలు జరపడం కరెక్ట్‌ కాదని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.


Next Story