- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రమేమైనా నీ తాత జాగీరా జగన్? నీకు అంగన్వాడీలు శాశ్వతంగా మెమో ఇవ్వడం ఖాయం
దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోగా నిరసలు చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తానని బెదిరించడం జగన్ రెడ్డి అధికారమదానికి నిదర్శనం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు . ఒక్క చాన్స్ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ జీతమిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రంతో సమానంగా జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలో కోత పెట్టావ్ అని మండిపడ్డారు. నువ్వు జీతాలు పెంచక, సంక్షేమం అందించక అంగన్వాడీలు ఎలా బతకాలి జగన్ రెడ్డీ? అని నిలదీశారు. ఇదేనా రాజన్న పాలనంటే? అని ప్రశ్నించారు. చంద్రబాబు రూ. 4,200గా ఉన్న అంగన్వాడీల జీతాన్ని రూ. 10,500 పెంచితే జగన్ రెడ్డి వారిని నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. అంగన్వాడీలపై జగన్ రెడ్డి కక్ష కట్టాడు అని విరుచుకుపడ్డారు. వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుతో లాఠీ చార్జ్ చేయిస్తున్నారని.... ప్రశ్నిస్తే మెమో ఇచ్చి బెదిరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రమేమైనా నీ తాత జాగీరా జగన్ రెడ్డీ ? నీకు అంగన్వాడీలు శాశ్వతంగా మెమో ఇచ్చే రోజు దగ్గర్లోని ఉంది జగన్ రెడ్డీ అని హెచ్చరించారు. అంగన్వాడీల న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ తరఫున అచ్చెన్నాయుడు మద్దతు ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరుస్తాం. సంక్షేమ పథకాలు అందిస్తాం అని అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.