ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి?: విజయసాయిరెడ్డి సెటైర్లు

by Seetharam |
ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి?: విజయసాయిరెడ్డి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి విమర్శలు చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఈ దేశంలో ఎవరికి బెయిల్ వచ్చినా చిన్నమ్మ పురందేశ్వరి సంతోషిస్తారని... కానీ కొందరి బెయిల్ మాత్రమే రద్దు చేయాలంటారని విమర్శించారు. ఇంత ఆత్మవంచన అవసరమా పురందేశ్వరి? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. తాను దోచుకున్న దాంట్లో వాటా ఇచ్చే బావకు బెయిల్ వచ్చిందనే ఆనందంలో తేలిపోతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒకవేళ అలాంటిదేమీ లేదంటే... బెయిల్ రద్దు చేయమని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయాలి అంటూ పురందేశ్వరికి విజయసాయిరెడ్డి సూచించారు.



Next Story

Most Viewed