చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం.. వెళ్తారా? లేదా?

by sudharani |
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం.. వెళ్తారా? లేదా?
X

దిశ, సినిమా: ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే.. చంద్రబాబు ప్రమాణం స్వీకార కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. అంతే కాకండా.. రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథిగా హాజరు రావాలని మెగాస్టార్ చిరంజీవికి చంద్రబాబు ఆహ్వానం పంపిచారు. ఈ నేపథ్యంలో రేపు ఈ కార్యక్రమానికి చిరంజీవి రామ్ చరణ్‌తో కలిసి ఇప్పటికే బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారని తెలుస్తుంది.

ఇక వీరితో పాటు.. జూనియర్ ఎన్టీఆర్‌కు సైతం ఆహ్వానం అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేసిన ఎన్టీఆర్.. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఈసారి ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉన్నాడు. కానీ, చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ గెలిచిన వెంటనే ఎన్టీఆర్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా వాళ్లకు శుభకాంక్షలు తెలిపాడు. అయితే.. మరి ఇప్పుడు ఈ ఆహ్వానం మేరకు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వెళ్తాడా? లేదా? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story