- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్.. జయప్రద కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదలైన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడంపై సినీ నటి జయప్రద స్పందించారు. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని జయప్రద అన్నారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని జయప్రద విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని..ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జయప్రద హితవు పలికారు. ఇకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైలులో అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోవడానికి ఏకంగా 15 గంటల సమయం పట్టింది. అనంతరం చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ మేరకు టీడీపీ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.