- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇండియా టుడే సర్వే ఫలితాలు విడుదల.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. అన్ని పార్టీలు తమ గెలుపు కోసం స్ట్రాటజీలు సిద్ధం చేసుకున్నాయి. ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయాలు రంజుగా మారాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఏపీలో ఈ సారి మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను టీడీపీ 17 స్థానాలు, వైసీపీ 8 స్థానాలు గెలుచుకుంటుందని అభిప్రాయపడింది.
అయితే ప్రస్తుతం వైసీపీ 22 ఎంపీలు ఉండగా 14 స్థానాలు కోల్పోతుందని సర్వే అభిప్రాయపడింది. టీడీపీ 3 ఎంపీ స్థానాలు ఉండగా 14 స్థానాలు మెరుగుపర్చుకుని 17 స్థానాల్లో గెలుస్తుందని అభిప్రాయ పడింది. ఇండియా, ఎన్డీఏ కూటమికి ఏపీలో ఒక్క స్థానం కూడా రాదని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది. ఓటు షేర్ విషయానికొస్తే వైసీపీకి 41 శాతం, టీడీపీకి 45 శాతం, ఎన్డీఏ కూటమికి 2శాతం, ఇండియా కూటమికి 3శాతం, ఇతరులకు 9శాతం ఓటు షేర్ వస్తుందని స్పష్టం చేసింది. కాగా 2019లో వైసీపీకి 49 శాతం, టీడీపీకి 40శాతం, ఎన్డీఏకు 1శాతం, ఇండియా కూటమికి 1శాతం, ఇతరులకు 9 శాతం ఓటు షేర్ నమోదైంది.