- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన.. స్టెరాయిడ్స్‌పై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు, ప్రభుత్వ వైద్యులు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని, చంద్రబాబు వాడే మందులు చూశాకే వేరే మందులు సిఫార్సు చేశామని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరమని చెప్పారు. చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సూచించామని, గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటో తమకు తెలియదని వైద్యులు స్పష్టం చేశారు. చంద్రబాబు వేసుకున్న మందులను తమకు చూపించారని వైద్యులు చెప్పారు.
ఇక జైలు అధికారులు మాట్లాడుతూ.. నిన్న వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు పంపించామని, ఇవాల్టి వైద్యుల నివేదికను కోర్టుకు వెంటనే పంపిస్తామని అన్నారు. తాము ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించమని, ములాఖత్ సమయం పూర్తయిందని గుర్తు చేయడం తమ బాధ్యత అని అన్నారు. చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటామని, చంద్రబాబు ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నారని పోలీస్ అధికారులు చెప్పారు. ములాఖత్ విషయంలో అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, కోర్టు ఎలా చెబితే అలా నడుచుకుంటామని అన్నారు.