Breaking: ఆలయాలకు సంబంధించి ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ

by srinivas |
Breaking: ఆలయాలకు సంబంధించి ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఆలయాల్లో(Temples) ప్రొటోకాల్(Protocol)పై దృష్టి సారించిన ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఆలయాల్లో పట్టువస్త్రాల సమర్పణకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దేవదాయశాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి, ఇన్‌చార్జ్‌ మంత్రి మాత్రమే పట్టు వస్ర్తాలు సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆలయాల్లో పండగల నిర్వహణకు అయ్యే ఖర్చును సీజీఎఫ్‌ నిధుల నుంచి వాడుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన యూసీలను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాగా గత ప్రభుత్వం హయాంలో ఏపీ ఆలయాల్లో నిబంధనలను ఉల్లంఘించారని, రూల్స్ పాటించలేదనే ఆరోపణలు వచ్చాయి. ఆయా ఆలయాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెల్లువెత్తాయి. అలాగే ఆలయాల్లో పండగ ఖర్చులకు సంబంధించిన యూసీలు కూడా సమర్పించలేదనే ఆరోపణలున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో ప్రోటోకాల్, నిబంధనలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed