- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:‘మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి..కంపెనీ పేరు ఇప్పుడే చెప్పను’..మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) పరిశ్రమల శాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. సమీక్ష ముగిసిన అనంతరం టీజీ భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి బీపీసీఎల్‌తో పాటు మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు కోరగా మంత్రి ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే పేరు చెప్పదలుచుకోలేదు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత చెబుతా’ అని భరత్ జవాబిచ్చారు.
దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేడు జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ MSME, క్లస్టర్ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని టీజీ భరత్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.