- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేను అక్కడి నుంచి పోటీ చేయను.. కాకపోతే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారని, గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారని వినికిడి. అయితే, గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని శ్రీకృష్ణదేవరాయలు తేల్చి చెప్పారని టాక్. నరసరావుపేట టికెట్ లావుకి ఇవ్వాలని లోక్‌సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సైతం సీఎంను కోరినప్పటికీ ఫలితం దక్కలేదట. ఈ విషయంలో జగన్ ఎవ్వరి మాటలను వినిపించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి పోటీ చేయలేనని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారని తెలుస్తోంది. అయితే, నరసరావుపేట ఎంపీ టికెట్ బీసీలకు ఇస్తారని సీఎం వైసీపీ ముఖ్య నాయకులతో చెప్పారని టాక్. దీంతో తనకు నరసరావుపేట ఇస్తే పోటీ చేస్తానని లేని పక్షంలో బరి నుంచి తప్పుకుంటానని సీఎంకు లావు శ్రీకృష్ణ దేవరాయలు తేల్చి చెప్పారట.