- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నరసాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేస్తా : రఘురామకృష్ణంరాజు
దిశ,నరసాపురం:సీఎం జగన్మోహన్ రెడ్డి కల, కల్లే అవుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. నరసాపురం స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.బుధవారం రచ్చబండలో మాట్లాడుతూ దరువు, పీడీ టీవీ, సాక్షి మీడియా, నీలి చానల్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసి, కుట్రలను పన్ని, నన్ను తప్పించే ప్రయత్నం చేసినా నేను నరసాపురం లోక్ సభ స్థానం నుంచే రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. నేను ప్రజల నుంచి వచ్చిన నాయకుడిని,ప్రజాభిమానం కలిగిన నాయకుడిని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు.
బీజేపీ టీడీపీ పొత్తు లేకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారని, పొత్తుకు నాలుగు రోజుల ముందు కూడా, పొత్తు పెట్టుకోవద్దు అంటూ బీజేపీ నాయకత్వాన్ని బ్రతిమాలారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా నరసాపురం స్థానాన్ని రఘురామకృష్ణం రాజుకు ఇవ్వొద్దంటూ జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదని ,పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని బీజేపీ తీసుకొవాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు.
తనకు టికెట్ రానివ్వకుండా చేస్తే,గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నప్పుడు, కూటమి నాయకులకు ఆ మాత్రం లాజిక్ ఉండదా? అని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెడ్డిని ఆయన కూతురే కాదని ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వైసీపీ నేత ఘోరంగా అవమానించారని గుర్తు చేశారు. ఒక కూతురును ఆమె తండ్రికి పుట్టలేదని పేర్కొనడం కంటే దారుణం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. లండన్ లో నివసించే స్వాతి రెడ్డి ని ఎన్నో రకాలుగా వేధించారని తెలిపారు.
Read More..