పెన్షన్‌దారులకు భారీ గుడ్ న్యూస్.. సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల

by Shiva |
పెన్షన్‌దారులకు భారీ గుడ్ న్యూస్.. సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సంక్షేమ పథకాల అమలు నిధుల విడుదలను ఈసీ అడ్డుకుంది. అయితే, ప్రస్తుతం పోలింగ్ ముగిసినందున డీబీటీ పథకాలకు అధికారులు నిధులు విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆసరా పథకానికి రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్‌ కోసం రూ.502 కోట్లు విడుదలయ్యాయి. ఈ పరిణామంతో లబ్ధిదారులకు అందజేస్తున నగదు బదిలీ ప్రక్రి పున: ప్రారంభమైంది. అదేవిధంగా పథకాలకు కూడా మరో రెండు రోజుల్లో నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

కాగా, జనవరి నుంచి మార్చి వరకు ఆరు పథకాలకు సంబంధించి రూ.14 వేల కోట్లను ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసింది. అయితే, ఎన్నికల దగ్గరికి రాగానే నగదు విడుదల చేయకుండా అధికార పార్టీ తీరా పోలింగ్ వరకు చూశారని, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అందరీ ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ ఆరోపించింది. ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేయగా.. వారు నిధుల విడుదలను పోలింగ్ అయ్యేంత వరకు నిధులు విడుదల చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed