కేంద్రపథకాలకు మీ స్టికర్లు ఎలా వేసుకుంటారు? : వైసీపీపై దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్

by Seetharam |
కేంద్రపథకాలకు మీ స్టికర్లు ఎలా వేసుకుంటారు? : వైసీపీపై దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో 50రధాలతో ప్రచారం నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రధానికి స్వాగతం పలికిన ఆమె అనంతరం వికసిత్ భారత్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అలాగే వికసిత్ భారత్ ఛాయా చిత్రాల ఎగ్జిబిషన్ ను పురంధేశ్వరి ప్రారంభించారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ...వికసిక్ భారత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రచార రథం ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. కేంద్ర పధకాలకు రాష్ట్ర పధకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారని అసలు పథకాల అమలుకు నిధులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది నేరుగా ప్రజలకు వివరిస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు

కేంద్ర పథకాలపై అవగాహన పెంచుకోవాలి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు స్టిక్కర్లు వేసి వైసీపీ ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం చాలా దారుణం అని పురంధేశ్వరి అన్నారు. కేంద్ర పధకాలకు రాష్ట్రప్రభుత్వం ఏవిధంగా స్టిక్కర్లు వేసుకుంటారని నిలదీశారు. మరోవైపు వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కి సీఎం నిధులు ఇవ్వక పోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిచిపోతున్నాయని పురంధేశ్వరి వెల్లడించారు. అయితే కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుంది అని గుర్తు చేశారు. ఇలాంటి పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు.

Advertisement

Next Story

Most Viewed