Journalists Housing: ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏ మండలంలో రేషన్​కార్డు ఉంటే అక్కడే..!

by Anil Sikha |
Journalists Housing: ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. ఏ మండలంలో రేషన్​కార్డు ఉంటే అక్కడే..!
X

దిశ, డైనమిక్​ బ్యూరో: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశం రాష్ర్ట ప్రభుత్వ (AP Government) పరిశీలనలో ఉందని రాష్ర్ట రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Minister Anagani) తెలిపారు. మంగళవారం శాసనసభలో (AP Assembly) జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సభ్యులు కొణతాల రామక్రిష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే ఆ మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. భూ సంబంధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై అధ్యయనం చేసి సిఫార్సు చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావించి ఇళ్ల స్థలాలను తక్కువ రేటుకు ఇవ్వడం సరైంది కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాలు ఎలా ఇవ్వాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను కూడా మోసం చేసిందన్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు జర్నలిస్టులకు ఇళ్లపట్టాలు ఇస్తామంటూ జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. జర్నలిస్టులపై భారం మోపేలా ఇళ్ల పట్టాల జీవోను ఇచ్చిందన్నారు. ఇళ్ల పట్టాల మంజూరులోనూ అనేక కఠిన షరతులు పెట్టిందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల పట్టా ఇవ్వలేకపోయిందన్నారు. కానీ తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు.



Next Story

Most Viewed