- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ కు ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
దిశ, డైనమిక్ బ్యూరో : పద్మశ్రీ డాక్టర్ కొలకలూరి ఇనాక్‌కు మరోఅరుదైన గౌరవం దక్కింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఆంధ్ర విశ్వ విద్యాలయం 90వ స్నాతకోత్సవం సందర్బంగా ఈనెల 9న విశాఖ యూనివర్సిటీ ఆడిటోరియం లో గౌరవ డాక్టరేట్ ప్రదానం జరగనుంది. ఇపోతే 1959లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేశారు కొలకలూరి ఇనాక్. అనంతరం అదే విశ్వ విద్యాలయంలో అధ్యాపకులుగా ప్రస్థానం ప్రారంభించిన ఇనాక్ తన 85వ ఏట అదే విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. సాహితీ విద్యా వట వృక్షంగా ఇనాక్‌ను అభివర్ణిస్తారు. ఆరున్నర దశాబ్ధాలపాటు సాహిత్య రంగంలో అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన సాహితీవేత్త. పీహెచ్‌డీ చేసిన శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయానికే వైస్ ఛాన్స్‌లర్ అయిన మహా మేధావి. గతంలో కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి కూడా ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చక్కటి పంచెకట్టులో చెదరని చిరునవ్వుతో తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తారు కొలకలూరి ఇనాక్. ఆంధ్రాయూనివర్సిటీలో చదివిన ఆయన అనంతరం ఆదే యూనివర్సిటీలో చదువు చెప్పిన గొప్ప సాహితీవేత్త. అలాంటి యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.