- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prajadarbhar:ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తా.. అర్జీదారులకు హోం మంత్రి అనిత హామీ
దిశ ప్రతినిధి, అనకాపల్లి: సమస్యలో ఉన్న ప్రజల కన్నీరు తుడుస్తా.. వారి కష్టాలు తీరుస్తానంటూ హోం మంత్రి వంగలపూడి అనిత భరోసానిచ్చారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఉద్ఘాటించారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆమె శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా హోం మంత్రి అర్జీలు స్వీకరించారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సుమారు 1000కి పైగా అర్జీలు వచ్చాయి. భూ సమస్యలు, శాంతిభద్రతలు,కుటుంబ సమస్యలు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు తదితర అంశాలపై అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అధికారులతో పాటు పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల అధికారులు పాల్గొన్నారు.