నిమ్మకూరులో బాలయ్య పర్యటన .. తల్లి గారి గ్రామానికి రావాలనడంపై ఆగ్రహం

by srinivas |   ( Updated:2025-02-27 10:24:59.0  )
నిమ్మకూరులో బాలయ్య పర్యటన .. తల్లి గారి గ్రామానికి రావాలనడంపై ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) పామర్రు మండలం(Pamarru Mandal) నిమ్మకూరు(Nimmakur)లో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పర్యటించారు. అయితే ఈ టూర్‌లో నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సొంతూరు నందమూరి తారకరామారావు(Nandamuri Ramarao) సొంత గ్రామం నిమ్మకూరుకు ఈ రోజు బాలయ్య వెళ్లారు. తండ్రి ఎన్టీఆర్, తల్లి బసవతారకం(Basavatarakam) విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌కు భారత రత్న వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. త్వరలో అమరావతిలో కూడా కేన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు బాలయ్య తెలిపారు.

అయితే బాలయ్యను గ్రామస్తులు, చిన్న నాటి స్నేహితులు కలిశారు. ఈ సందర్భంగా తల్లి బసవతారకం సొంతూరు కొమరువోలు నుంచి కూడా కొందరు గ్రామస్తులు నిమ్మకూరుకు వెళ్లారు. బాలయ్యను కలిశారు. ఫొటోలు సైతం దిగారు. ఇంతలో ఓ వ్యక్తి.. కొమరవోలును అభివృద్ధి చేయాలని బాలయ్యను కోరారు. దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జన్మలో కొమరవోలుకు రానని తేగేసి చెప్పారు. ఫొటోలు దిగారుగా వెళ్లి రండి అంటూ కామెంట్స్ చేశారు. దీంతో కొమరువోలు గ్రామస్తులు నిరాశతో తిరిగి వెళ్లిపోయారు. అయితే బాలయ్య తన తల్లి గ్రామానికి వెళ్లేందుకు ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘‘తల్లి పేరుతో హైదరాబాద్‌లో కేన్సర్ ఆస్పత్రి నడుపుతున్న బాలయ్య ఎందుకు కొమరువోలు వెళ్లనన్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది..’’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.



Next Story

Most Viewed