- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Herd of Elephants: మరోసారి ఏనుగుల మంద హల్‌చల్.. భారీగా కొబ్బరి తోట ధ్వంసం
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏనుగులు (Elephants) భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పొలాలు, తోటల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. అదేవిధంగా పొలం పనులు చేసుకుంటున్న రైతులపై దాడులకు తెగబడుతూ.. వారి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. తాజాగా, విజయనగరం జిల్లా (Vizianagaram) పార్వతీపురంలో ఎనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. కారాడవలసలో కొబ్బరి తోటను గజరాజులు పూర్తిగా ధ్వంసం చేశాయి. అది చూసిన గ్రామస్థులు భయాందోళనలతో పరుగులు తీశారు. శనివారం సాయత్రం ఆటో, మిల్లర్‌ను గజరాజుల గుంపు బోల్తా కొట్టించాయి. రంగంలోకి దిగిన అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను బంధించేందుకు ట్రాక్ చేస్తున్నారు.
Next Story