- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Rain Alert:రేపు, ఎల్లుండి వర్షాలు.. ఆ జిల్లాల్లో ఆకస్మాత్తుగా పిడుగులు పడే ఛాన్స్!

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అయితే వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల గత వారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో మళ్లీ ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయాన్నే భానుడు తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఏపీ విత్తుల నిర్వహణ సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
నేడు(బుధవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, ఏలూరు జిల్లా పోలవరం, వేలేరుపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా-6, తూర్పుగోదావరి-1, ఏలూరు-5, ఎన్టీఆర్-2, గుంటూరు-9, పల్నాడు-2 మండలాల్లో ఓ మోస్తరు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు(గురువారం) 56 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి మరియు దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి వచ్చి ఆ తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు అవకాశం ఉంది. శుక్రవారం (11 తేదీ) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. నిన్న(మంగళవారం) నంద్యాల జిల్లా దొర్నిపాడు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5°C, కర్నూలు జిల్లా కామవరం 40.7 C, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6°C, ప్రకాశం జిల్లా దరిమడుగలో 40.6°C, అల్లూరి సీతారామరాజు ఎర్రం పేట 40.3°C, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మొత్తం 25 ప్రాంతాల్లో 40°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.