YS Jagan:‘మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు’.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula Mamatha |
YS Jagan:‘మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు’.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు(CM Chandrababu) హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54 శాతం ఉంటే , వైసీపీ(YSRCP) పాలనలో 13.57 శాతం మాత్రమేనని వైఎస్ జగన్(YS Jagan) చెప్పారు. ఈరోజు(బుధవారం) మాజీ సీఎం జగన్ తాడేపల్లి లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో రాష్ట్ర అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం(State Income) భారీగా తగ్గిపోయిన పరిమితికి లోబడే అప్పులు చేశామని వైఎస్ జగన్ తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం, వైసీపీ హయాంలో 9వ స్థానానికి చేరిందని ఆయన పేర్కొన్నారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పై వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని జగన్ విమర్శించారు. రాజకీయాల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనకాడరని జగన్ దుయ్యబట్టారు. తల్లిదండ్రులు బతికుండగా ఎప్పుడైనా వారిని ప్రజలకు చూపించావా? రాజకీయంగా ఎదిగాకైనా పేరెంట్స్‌ను నీ ఇంటికి పిలిచి రెండు పుటలా భోజనం పెట్టి సంతోషంగా పంపించావా? ఒక్కసారైనా కలిసి ఉన్నావా? కాలం చేసిన తర్వాత కనీసం తలకొరివి పెట్టావా? అని వైఎస్ జగన్ నిలదీశారు. ఇక తల్లి, చెల్లి పేరుతో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed