GVMC: ‘జీవీఎంసీ’ కూటమిదే.. గంటా శ్రీనివాస్, సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shiva |
GVMC: ‘జీవీఎంసీ’ కూటమిదే.. గంటా శ్రీనివాస్, సీఎం రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు కూటమి నేతలు అనుకన్నది సాధించారు. మహా విశాఖ నగర పాలక సంస్థ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి (Mayor Golagani Hari Venkata Kumari)పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జీవీఎంసీ (GVMC) ఇన్‌ఛార్జ్‌ కమిషనర్, కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ (Harendhira Prasad) అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఇటీవలే చాలామంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీకీ రాజీనామా చేయడంతో కూటమి బలం అనూహ్యంగా పెరిగింది. GVMCలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా.. సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరై వారు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో మేయర్‌పై కూటమి నేతలు పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లుగా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ ప్రకటించారు.

ఇక వైసీపీ కార్పొరేటర్లు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. అదేవిధంగా రేపు కొత్త మేయర్‌ ఎంపిక ప్రక్రియ జరగనున్నట్లుగా. అయితే, కూటమి అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం గెలిచిందని కామెంట్ చేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా 74 మంది ఓటు వేయడం శుభ పరిణామమని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) మాట్లాడుతూ.. వైసీపీ అరాచక పాలనకు జీవీఎంసీ సభ్యులు చరమగీతం పాడారని పేర్కొన్నారు. త్వరలోనే మంచి మేయర్‌ను ఎంపిక చేస్తామని గంటా తెలిపారు.



Next Story

Most Viewed