టీడీపీకి బిగ్ షాక్.. అత్యంత కీలక వ్యక్తి రాజీనామా

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-24 13:27:57.0  )
టీడీపీకి బిగ్ షాక్.. అత్యంత కీలక వ్యక్తి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే అనూహ్య షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్(Chairman of AP Fiber Net) పదవికి, టీడీపీ(TDP) ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి(GV Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు.

‘‘వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, మరియు ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు’ అని రాజీనామా లేఖలో జీవిరెడ్డి పేర్కొన్నారు..



Next Story