- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Assigned Lands Caseలో కొత్త ఆధారాలు.. హైకోర్టులో రెండు పిటిషన్లు.. విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్: అసైన్డ్ ల్యాండ్ కేసు విచారణ నవంబర్ 1కి వాయిదా పడింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు, నారాయణ అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కోర్టులో విచారణ పూర్తైంది. ఇవాళ తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కొత్త ఆధారాలున్నాయని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు ఆడియో ఆధారాలు అందజేశారు. మంగళవారం వీడియో ఆధారాలు సైతం అందిస్తామని అధికారులు కోర్టుకు తెలిపారు. అయితే కొత్త ఆధారాలు ఉన్న నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీడీఐ అధికారులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఐడీ అధికారులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. కేసు రీ ఓపెన్ చేయడంపై ఏమైనా అభ్యంతాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణను నవంబర్ 1కి వాయిదా వేసింది.