Nandigam Suresh : నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్

by srinivas |   ( Updated:2024-09-05 12:43:57.0  )
Nandigam Suresh : నందిగం సురేశ్‌కు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైదరాబాద్‌లో గురువారం ఉదయం సురేశ్‌ను అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు మంగళగిరికి తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం నందిగంకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు జైలుకు తరలించారు.

అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో పోలీసు బృందాలు గాలించి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నందిగం సురేశ్ హైదరాబాద్ మియాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఓ గెస్ట్ హౌస్‌లో ఉన్న సురేశ్‌ను అరెస్ట్ చేసి మంగళగిరికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed