- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Real Scam: గుంటూరులో రియల్ బూమ్ బూమ్
దిశ, సత్తెనపల్లి: కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. స్తిరాస్థి వ్యాపారం జోరందుకుంది. మొన్నటి దాకా మొండికేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు పట్టాలెక్కి పరుగులు పెడుతుంది. రియల్ మార్కెట్ ఊపందుకోవడంతో పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయి. పచ్చటి పైర్లును మింగిన రియల్ బిజినెస్ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో వ్యాపారులు ఇబ్బడి ముబ్బడిగా పంట పొలాలను కొనేస్తున్నారు. ఆర్భాటంగా లేఅవుట్లు వేసి అక్రమంగా అమ్మేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఈ వ్యాపారం జోరందుకుంది. నోట్ల కట్టల లాబీయింగ్‌తో అధికారులను సైలెంట్ అయిపోతుంటే వ్యాపారులు అనుమతులు లేకుండానే వెంచర్లు వేసి భారీగా లాభపడుతున్నారు.
కనుమరుగవుతున్న పంట పొలాలు..
గుంటూరు మంగళగిరి తెనాలి నరసరావుపేట సతైనపల్లి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. రాజధాని అమరావతికి సమీప పట్టణాలు కావటంతో ఇక్కడ ప్లాట్ల క్రయవిక్రయాలకు డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా వ్యాపారులు వ్యవసాయ భూమిని నాలా కన్వర్షన్ లేకుండానే ప్లాట్లుగా మార్చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా లేఅవుట్లు వేస్తున్నారు. నాలా కన్వర్షన్ లేకుండానే ప్లాట్లుగా వేస్తున్నారు. ఎటువంటి పన్నులు చెల్లించకుండానే మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో జిమ్మిక్కులు చేసి ప్రభుత్వ ఆదాయానికి పెద్దమొత్తంలో గండికొడుతున్నారు.
నోట్ల మత్తుతో మౌనం..
జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో కొంత భాగం మాత్రమే వ్యవసాయ భూమిగా ఉంది. మిగతాదంతా అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లుగా మార్చేస్తున్నారు. దీంతో రహదారికి ఇరువైపులా వ్యవసాయ భూములు కనుమరుగవుతున్నాయి. నాలా కన్వర్షన్ లేకుండానే ప్లాట్లుగా మారుస్తూ.. జోరుగా విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. ఇంటి స్థలాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న మధ్యతరగతి ప్రజల ఆశను రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. కాసులకు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
నిబంధనలు బేఖాతరు..?
నిబంధనల ప్రకారం నాలా పన్ను చెల్లించిన తర్వాతనే వ్యవసాయ భూములను లేఅవుట్లు చేసి వ్యవసాయేతర భూములుగా మార్చాలి. ఉమ్మడి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ విషయం రెవెన్యూ, పంచాయతీ, పట్టణ ప్రణాళిక అధికారులకు తెలిసినా.. రియల్ వ్యాపారుల మాముళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదు. మండలంలో ఎన్నో ఎకరాల వరకు నాలా కన్వర్షన్ లేకుండానే వ్యవసాయ భూములను రియల్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. వ్యవసాయేతర భూములను ఎలాంటి పన్ను ప్రభుత్వానికి చెల్లించకుండా ఆయా వ్యాపారాలకు పలువురు వ్యాపారులు ఉపయోగించుకుంటున్నట్లు ఆయా శాఖల రికార్డులు ద్వారా తెలుస్తుంది.