Tadepalli: రామచంద్రాపురం పంచాయితీపై జగన్ ఆరా..వివరించిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్

by srinivas |   ( Updated:2023-07-18 13:02:52.0  )
Tadepalli: రామచంద్రాపురం పంచాయితీపై జగన్ ఆరా..వివరించిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరు నేతలు సైతం బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు దీంతో నియోజకవర్గం వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంపీ, మంత్రి విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరి కార్యక్రమానికి వెళ్లనే గందరగోళం వైసీపీ కార్యకర్తల్లో ఉంది. ఇటీవల ఎంపీ నిర్వహించిన కార్యక్రమానికి రామచంద్రాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీ వెళ్లారు. అయితే ఆ కార్యక్రమానికి ఎందుకు వెళ్లావంటూ శివాజీపై ఒత్తిళ్లు పెరిగాయి. మంత్రి వేణు సమక్షంలోనే ఆయన వర్గీయులు శివాజీపై దాడి చేశారు. దీంతో మనస్థాపం చెందిన శివాజీ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇప్పుడు ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో తనను కలవాలని ఎంపీ సుభాష్ చంద్రబోస్‌ను ఆదేశించారు. దీంతో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ బోస్ కలిశారు. రామచంద్రాపురం పంచాయితీపై అరగంటకు పైగా సీఎం జగన్‌కు బోస్ వివరించారు. భేటీ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

Next Story