ముత్తూట్‌ ఫైనాన్స్‌లో గోల్డ్ లోన్ లెక్కలు గోల్ మాల్

by Jakkula Mamatha |
ముత్తూట్‌ ఫైనాన్స్‌లో గోల్డ్ లోన్ లెక్కలు గోల్ మాల్
X

దిశ, పల్నాడు: సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో గోల్డ్ లోన్ లెక్కలు తారుమారు జరిగాయని ఆరోపిస్తూ శనివారం ఆ కార్యాలయం ఎదుట దంపతులు పెట్రోల్ బాటిల్‌తో ఆత్మహత్యకు యత్నించారు. దీంతో ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దంపతులను అడ్డుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది.

సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన సైదయ్య మంగమ్మ సత్తెనపల్లి ముత్తూట్ సంస్థలో 4 సవర్ల బంగారు ఆభరణాలు కుదువ పెట్టి రూ.లక్ష 5 వేల లోన్ తీసుకుంటున్నారు. ఇటివల దంపతులు రూ. 80 వేల నగదును లోన్ కు జమ చేసినట్లుగా తెలిపారు. కట్టాల్సిన నగదు రూ. 26 వేలు కట్టవలసిందిగా ముత్తూట్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. తమ ఖాతాలో సిబ్బందే లెక్కలు తారుమారు చేసి తమను అధికంగా నగదు కట్టాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నట్లు వాపోయారు. పోలీసులు తమ ఫిర్యాదు పై విచారించి జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


Next Story

Most Viewed