Tdp Mini Manifesto: ఒక్కో కుటుంబానికి రూ.1.22 లక్షల ఆర్థిక సాయం

by srinivas |   ( Updated:2023-06-19 10:22:33.0  )
Tdp Mini Manifesto: ఒక్కో కుటుంబానికి రూ.1.22 లక్షల ఆర్థిక సాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1.22 లక్షలు ఆర్థికసాయం అందుతుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. అంతేకాదు అదనంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుందని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్రను ఈనెల 20 నుంచి ప్రారంభించబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వెల్లడించారు. రాష్ట్ర సంపద పెంచాలన్న, పేదలకు పంచాలన్నా చంద్రబాబుతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరవయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత, సీఎం బాధ్యతారాహిత్యం వల్లే అరాచకాలు పెరిగాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

Also Read..

తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు: బాబు కీలక వ్యాఖ్యలు



Next Story