- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: 18 మంది ఎమ్మెల్యేల లిస్ట్ రెడీ.. టికెట్లపై సీఎం షాకింగ్ డెసిషన్
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పని తీరుపై నిఘా పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్లలేదో ఆయా ఎమ్మెల్యేల జాబితాను తెప్పించుకున్నారు. మొత్తం 18 ఎమ్మెల్యేల పని తీరు సరిగా లేదని గుర్తించారు. ఈ మేరకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. గడపగడపకు కార్యక్రమంలో 18 మంది ఎమ్మెల్యేలు పాల్గొనలేదని.. వారి వివరాలను పార్టీ నేతలకు తెలియజేశారు. వారెందుకు గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనలేదని ఆరా తీశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున తిరగలేదని సీఎం దృష్టికి రావడంతో వారిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఇక నుంచైనా బాగా తిరగాలని వారిని సీఎం జగన్ ఆదేశించారు.
గడప గడపకు కార్యక్రమం వల్ల పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రాఫ్ బాగుంటేనే సీట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో జగనన్న సురక్షా ప్రచారంపైనా చర్చించారు. కార్యక్రమంపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి నెల రోజులపాటు ప్రచారం నిర్వహించాలని పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు.