- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ దూకుడు.. త్వరలో ఫైనల్ లిస్టు
దిశ, వెబ్ డెస్: సీఎం జగన్ మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు చేయించారు. ఇందులో భాగంగా చాలా నియోజవకర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకులపైనా వ్యతిరేకత ఉందని తేలింది. దీంతో వైసీపీ ఇంచార్జుల మార్చారు. పది విడతల్లో కొత్త ఇంచార్జులను నియమించారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 175 నియోజకవర్గాల అభ్యర్థులపై ఆయన దృష్టి పెట్టారు. మొత్తం సీట్లకు అభ్యర్థులను ఫైనల్ చేసిన పనిలో పడ్డారు. బలాలు, గెలుపుపై పరిశీలన జరుపుతున్నారు. అటు ఎన్నికల ప్రచారాన్ని సైతం ముమ్మరం చేశారు. ఇప్పటికే సిద్ధం సభలను కొనసాగిస్తున్నారు. ఇంకా మరిన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అటు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు సంకేతాల్లో వారి అభ్యర్థులను ఢీకొట్టేలా నేతలను ఎంపిక చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 175 స్థానాల్లో గెలుపు సాధించాలని సీఎం జగన్ పట్టుమీద ఉన్నారు. అందుకే ఆ పార్టీల అభ్యర్థులు ఖరారుకాక ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని సీఎం జగన్ కసరత్తులు కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కసరత్తులు పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో జగన్ అంచనాలను అందుకుంటారేమో చూడాలి.