- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Elections 2024: వైసీపీకి భారీ షాక్.. ఆ పార్టీలో లో చేరిన కీలక నేత
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి మరో పార్టీకి మకాం మారుస్తున్నారు. తాజాగా మరోసారి వైసీపీ భారీ షాక్ తగిలింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ పార్టీకి బైబై చెప్పేసారు. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బీజీపీలో చేరారు. ఈ నేపధ్యంలో ఆయనకు తిరుపతి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక బీజేపీ తీర్ధం పుచ్చుకున్న తరువాత వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తనకు పార్టీ లో స్తానం కల్పించినందుకు బీజేపీకి అలానే తనకు అవకాశం ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇక తిరుపతి ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి తనకు అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. ఇక చిరంజీవి అవకాశం కల్పించడంతో తన రాజకీయ ప్రస్థానం మొదలయింది అని, అలానే పవన్ కళ్యాణ్ కూడా తనకి అవకాశం ఇచ్చారని తెలిపారు.
ఆ తరువాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తనకి అవకాశం ఇచ్చారని.. తనకి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నిజాయితీగా కృతజ్ఞతలు తెలుపుతున్నా అని అన్నారు. ఇక ఇప్పుడు తనకి అవకాశం ఇచ్చినందుకు బీజేపీకి, మోడీకి చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియ చేశారు.