Ap Assembly Sesstions: గత ప్రభుత్వ తప్పులపై గవర్నర్ కీలక ప్రసంగం

by srinivas |
Ap Assembly Sesstions: గత ప్రభుత్వ తప్పులపై గవర్నర్ కీలక ప్రసంగం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం కొనసాగుతోంది. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన తప్పులపై ప్రస్తుత ప్రభుత్వం తరపున ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘విభజనతో రాష్ట్రంలో లోటు బడ్జెట్ మిగిలింది. దీంతో రాష్ట్రం ఒడిదుడుకులకు లోనైంది. వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ప్రతీకార రాజకీయాలు చేసింది. విభజన అశాస్త్రీయంగా జరిగింది. దీంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. 2014-19 మధ్య రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయి. పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడలేదు. 2019లో రాష్ట్రం అభివృద్ది దిశగా పరుగులు పెడుతున్న సమయంలో అధికారం మారింది. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులపై మూల ధన వ్యయం 56 శాతానికి పడిపోయింది.’’ అని గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed