Breaking: అర్చకులకు గుడ్ న్యూస్.. వేతనం భారీగా పెంపు

by srinivas |   ( Updated:2024-08-27 16:29:04.0  )
Breaking: అర్చకులకు గుడ్ న్యూస్.. వేతనం భారీగా పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అర్చకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అర్చకుల వేతనాన్ని భారీగా పెంచింది. అర్చకులకు ఇప్పటి వరకూ ప్రతి నెల రూ. 10 వేలు ఇస్తోంది. ఇక నుంచి రూ. 15 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్న రూ. 5 వేలను రూ. 10 వేలకు పెంచింది. ఆలయాల కల్యాణకట్టలో పని చేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు చేపడుతోంది. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలపైనా ఆలోచనలు చేస్తోంది. దేవాలయాల ఆస్తులను పరిరక్షించేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది.

అలాగే ఆధ్యాత్మిక పర్యటకాభివృద్ధిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. మరోవైపు సింహాచలం పంచగ్రామాల సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఆలయంలో వితరణ చేసే ప్రసాదంలో నాణ్యత ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు ఆలయాల్లో అపచారాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టేదిశగా అడుగులు వేస్తోంది. బలవంతపు మార్పిడిలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. భక్తుల మనోభావాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు నిరుద్యోగులకు సైతం రూ. 3 వేలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. దేవదాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed