Mla Rajasing: చంద్రబాబు అంటే గౌరవం.. రాజకీయంగా లైఫ్ ఇచ్చారు

by srinivas |
Mla Rajasing: చంద్రబాబు అంటే గౌరవం.. రాజకీయంగా లైఫ్ ఇచ్చారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని... రాజకీయంగా తనకు చంద్రబాబే లైఫ్ ఇచ్చారని ఆయన తెలిపారు. గౌరవం వేరు.. రాజకీయాలు వేరు అని, ఆంధ్రాలో టీడీపీ ప్రభుత్వం రావాలని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు కారణం అని.. కేసీఆర్‌తో ఏమీ కాలేదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో ఆయన టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై రాజాసింగ్ స్పందించారు. తన మెంటాలిటీకి బీజేపీ మాత్రమే సూట్ అవుతుందని చెప్పుకొచ్చారు.తాను హిందూ ధర్మం కోసం పని చేస్తానని గోషామహల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story