- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో రాయితీ ఇవ్వండి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
దిశ, డైనమిక్ బ్యూరో : కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో రాయితీ ఇవ్వాలని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని రిక్వస్ట్ చేశారు. కళాకారులు, సీనియర్ సిటిజన్లకు కీలకమైన ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తూ, ప్రస్తుతం ఉన్న సస్పెన్షన్‌ను పున్ణపరిశీలించాలని రైల్వే మంత్రిని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కోరారు. నృత్యం, సంగీతం, నాటక ప్రదర్శనలు చేసేవారు గతంలో 50-75 శాతం రాయితీని పొందారు అని గుర్తు చేశారు. ఇందులో సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌లలో 75 శాతం రాయితీ, 1వ తరగతికి 50 శాతం రాయితీ, ఏసీ చైర్‌కార్, 3ఏసీ, 2ఏసీ ఉన్నాయని గుర్తు చేశారు. రాబోయే 26 జనవరి వేడుకలు, ఇతర ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రదర్శనలు ఉన్న నేపథ్యంలో ఈ రాయితీలను పునరుద్ధరించడం చాలా కీలకం అని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు సూచించారు.