Breaking: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భారీ ఊరట

by srinivas |   ( Updated:2025-04-04 13:50:14.0  )
Breaking: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భారీ ఊరట
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి భారీ ఊరట లభించింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలోని గుర్రాల కొండపై ఆయన గెస్ట్‌హౌస్ నిర్మిచుకున్నారు. అయితే శక్తివడియార్ చెరువు భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, బంధువులు, అనుచరులను బినామీలుగా చూపిస్తూ రికార్డులు సృష్టించారని ఆయనపై గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. దశాబ్దాల నాటి రికార్డులను బయటకు తీసి పరిశీలించారు. శక్తివడియార్ చెరువుకు సంబంధించి సర్వే నెంబర్ 908లో 9.30 ఎకరాలు, 909 సర్వే నెంబర్‌లో 7.90 ఎకరాలు, 910 సర్వేలో 2.50 ఎకరాలు, 661-1 లో 0.91 సెంట్లను ఆక్రమించారని గుర్తించారు.

ఈ మేరకు కేతిరెడ్డి తమ్ముడు భార్య గాలి వసుమతితో పాటు పలువురికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమించుకున్న భూమి వివరాలను నోటీసుల్లో స్పష్టం చేశారు. మొత్తం 20.61 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని తెలిపారు. చెరువు, నీటి పారుదల శాఖతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన 2.61 ఎకరాల భూమిని ఆక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈమేరకు 2.61 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు గురువారం ప్రయత్నం చేశారు. అయితే గుర్రాల కొండపైకి వెళ్లే మార్గం గేటు మూసి ఉండటంతో తిరిగి వెళ్లిపోయారు. గెస్ట్ హౌస్ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు కేతిరెడ్డికి రిలీఫ్ కలిగించాయి.

కాగా తాను గెస్ట్ హౌస్ నిర్మించుకున్న భూమి ప్రభుత్వానిది కాదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గతంలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలుమార్లు వాదనలు కొనసాగాయి. తీరా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకునే సమయంలో కేతిరెడ్డికి భారీ ఊరట లభించింది. గెస్ట్‌హౌస్‌ వివాదంలో హైకోర్టు స్టేటస్‌కో విధించింది. దీంతో కేతిరెడ్డి తరపు వాదనలు వినిపించిన లాయర్లు హర్షం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed