ఈ డీల్ మొత్తంలో ఉంది విక్రాంత్ రెడ్డి: పోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఈ డీల్ మొత్తంలో ఉంది విక్రాంత్ రెడ్డి: పోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ పోర్టు(Kakinada Port) వాటాలను బెదిరించి తీసుకున్నారని వ్యాపార వేత్త కేవీరావు(Businessman K.V. Rao) ఆరోపించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former CP MP Vijayasai Reddy)ని సీఐడీ అధికారులు విచారించారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఈ రోజు జరిగిన విచారణలో ఆయన పాల్లొన్నారు. సీఐడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ డీల్ మొత్తంలో ఉంది వైవీ విక్రాంత్ రెడ్డే(YV Vikrant Reddy)నని వెల్లడించారు. కేవీరావు, వైబీ సుబ్బారెడ్డి అత్యంత అప్తులు అని పేర్కొన్నారు. కేవీరావు అంటే తనకు అసహ్యమని ఆయన చెప్పారు. అమెరికాలో కేవీరావు ఇంట్లోనే వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఉంటారని తెలిపారు. తనపై ఆరోపణలు ఎవరు చేయించారో..ఎలా చేశారో అనేది మొత్తం తనకు అర్ధమైందని విజయసాయిరెడ్డి చెప్పారు.

ఈ కేసు కొనసాగినా తనకు వచ్చిన నష్టమేమీ లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. కేవీరావుతో తాను మాట్లాడలేదని, అలా చేస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. వాళ్లు ఎదిగేందుకు తనకూ, జగన్‌కు విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇందులో పాత్రదారులు, సూత్రదారులెవరో తనకు తెలసన్నారు. కోటరీ నుంచి వైఎస్ జగన్(Ys Jagan) బయటకు రావాలని సూచించారు. అప్పుడే జగన్ భవిష్యత్తు బాగుందని తెలిపారు. ఈ ఆరోపణల వెనుక జగన్ ప్రమేయం లేదని తాను నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు. తాను జీవితంలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పారు. జగన్ మనసులో తనకు స్థానం లేదు కాబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Next Story